News March 18, 2024

రోహిత్ తిట్టినా పట్టించుకోం: కుల్‌దీప్ యాదవ్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ తమను తిట్టినా పట్టించుకోమని స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అన్నారు. ‘ఫీల్డింగ్ మిస్ అయినప్పుడు రోహిత్ అనే మాటలకు మేమేమీ బాధపడం. మైదానంలో దిగినప్పుడు అలాగే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వచ్చాక తిరిగి తను మా మీద చాలా ప్రేమ చూపిస్తాడు. తనతో మా అందరికీ మంచి అనుబంధం ఉంది. మ్యాచ్‌లో నా బౌలింగ్‌ గురించి ఏం చెప్పడు కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం మెరుగవ్వమంటాడు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

జనగామ: పంచాయతీ ఎన్నికలు.. నిఖిల ఆదేశాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు నిఖిల నోడల్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనగామ జిల్లాకి జనరల్ అబ్జర్వర్‌గా నిఖిల నియామకమైన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.