News April 21, 2024

జగన్‌లా నాపై 32 కేసులు లేవు: పవన్ కళ్యాణ్

image

AP: సీఎం జగన్‌లా తనపై 32 కేసులు లేవని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘జగన్‌లా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేను. ఆయనకు కాపుల ఓట్లు మాత్రమే కావాలి. వారి అభివృద్ధి పట్టదు. నేను ఒక్క కులం కోసం పనిచేయను. రాష్ట్రాభివృద్ధి కోసమే ఎన్డీఏతో కలిశాం. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ప్రతీ చేనుకు నీరు.. ప్రతీ చేతికి పని.. ఇదే మా నినాదం. ఆక్వా రైతులకు అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 23, 2026

ఘోరం: ఆస్పత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది మృతి

image

సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్(RSF) మధ్య ఆధిపత్య పోరు సామాన్యుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా ఈద్ రోజున RSF ఆధీనంలో ఉన్న ఓ నగరంలోని ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 64 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది పిల్లలు, ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నట్లు WHO వెల్లడించింది. మరో 89 మంది గాయపడినట్లు తెలిపింది. ఈ దాడిని ఆర్మీ చేసినట్లు RSF ఆరోపిస్తుండగా తమకు సంబంధం లేదని సైనికులు ప్రకటించారు.

News March 23, 2026

పేరెంట్స్‌ను పట్టించుకోకపోతే జీతంలో రూ.10వేలు కట్!

image

TG: కన్నవారిని పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం షాకివ్వనుంది. వారి జీతంలో 15% లేదా ₹10K కట్ చేసి నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్‌ను తీసుకురానుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించనుంది. ఒకట్రెండు రోజుల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయనుంది.

News March 23, 2026

రాష్ట్రంలో 11వేలకుపైగా హెక్టార్లలో పంట నష్టం

image

AP: అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలోని 11,337 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 15 జిల్లాల్లోని 9,950 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9 జిల్లాల్లోని 1,387 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వరి 2,650 హెక్టార్లు, మొక్కజొన్న 6,450 హెక్టార్లు, మినుముకు 485 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. మరోవైపు యుద్ధంతో ఎగుమతులు తగ్గి రాయలసీమలో కమలాపండు పంట ధర టన్ను ₹10వేలు తగ్గి ₹22వేలకు చేరింది.