News March 19, 2024
నాకు ట్విటర్ అకౌంట్ లేదు: సిద్ధార్థ్

తనకు ట్విటర్ అకౌంట్ లేదని నటుడు సిద్ధార్థ్ వెల్లడించారు. నిన్న RCB జట్టు WPL టైటిల్ గెలిచిన తర్వాత సిద్ధార్థ్ పేరుతో ఒక వ్యక్తి ‘ఒక్క మహిళ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు’ అని ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే.. చాలామంది నటుడు సిద్ధార్థ్ అలా పోస్ట్ చేశారని అనుకున్నారు. దీంతో స్పందించిన సిద్ధార్థ్ ‘దయచేసి నాకు క్రెడిట్ ఇవ్వడం ఆపేయండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
Similar News
News December 17, 2025
Avatar-3కి షాకింగ్ రివ్యూస్

ఈనెల 19న రిలీజ్ కాబోతున్న అవతార్3కి కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇప్పటికే రివ్యూస్ ఇచ్చేస్తున్నాయి. BBC, గార్డియన్, రోటెన్ టొమాటోస్, IGN సహా మీడియా హౌజెస్ మూవీ స్టోరీ ఆకట్టుకోదని చెబుతున్నాయి. కామెరూన్ టేకింగ్, యాక్షన్ బాగున్నా కొన్ని సీన్స్ గతంలో చూశాం అనే ఫీల్ కల్గిస్తాయట. BBC 1/5, గార్డియన్ 2/5 రేటింగ్ ఇచ్చాయి. కాగా అవతార్1కు మంచి రెస్పాన్స్ రాగా, పార్ట్2ను క్రిటిక్స్ ఓకే అన్నారు.
News December 17, 2025
రబీ సీజన్.. అందుబాటులో 2 లక్షల మె.టన్నుల యూరియా

AP: రబీ సీజన్‌కు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 2.01 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడించింది. ప్రతి జిల్లాలో 21 రోజులకు సరిపడా యూరియాను బఫర్ స్టాకుగా ఉంచుకోవాలని, 2 రోజులకు ఒకసారి యూరియా నిల్వలపై మీడియాకు సమాచారం అందించాలని, రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు.
News December 17, 2025
చేతిలో డబ్బు నిలవాలంటే..

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.


