News January 2, 2025
గోదాం వ్యవహారాలేవీ నాకు తెలియదు: పేర్ని జయసుధ

AP: గోదాముల వ్యవహారాల గురించి తనకు అసలు తెలియదని పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసులు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వ్యవహారాలన్నీ తమ మేనేజర్ మానస తేజ చూసుకునేవారని ఆమె అన్నట్లు సమాచారం. గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైన కేసులో ఆమె ఏ-1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో సుమారు రెండున్నర గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు.
Similar News
News November 23, 2025
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.


