News October 6, 2024

ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా?: CM

image

TG: 20ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు పేదోడి దుఃఖం తెలియదా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘ఇల్లు కూలితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలియదా? ZP మెంబర్ నుంచి సీఎం అయ్యాను. వాళ్లందర్నీ ఎలా ఆదుకోవాలో చెప్పండి. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసింది. పేదల కోసం మరో రూ.10వేల కోట్లు అప్పు చేద్దాం. KCRకు 1000ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. BRS ఖాతాలో రూ.1500కోట్లున్నాయి. అదంతా పేదల డబ్బే’ అని రేవంత్ అన్నారు.

Similar News

News April 4, 2026

IPL చూసేవారికి JIO షాక్

image

మెగా టోర్నీ వేళ రిలయన్స్ జియో రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. గతంలో 90 రోజుల పాటు అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఇప్పుడు కేవలం 30 రోజులకు తగ్గించింది. అయితే ఇందులో వచ్చే 15GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను యథావిధిగా అందిస్తుంది. వ్యాలిడిటీ తగ్గడం వల్ల తక్కువ ధరకే ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది భారంగా మారింది.

News April 4, 2026

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

image

కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,50,930 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹1,38,350గా ఉంది. అటు KG సిల్వర్ రేటు ₹2,55,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలతో ధరలు నిలకడగా ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు.