News August 12, 2025
అలాంటి రోల్ చేయడం నచ్చలేదు: అనుపమ

‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటిస్తున్న సమయంలో తాను కంఫర్ట్‌గా లేనని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. చాలా కాలం ఆలోచించాకే ఆ సినిమా ఒప్పుకొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో లిల్లీ పాత్ర చేయడం నచ్చలేదని, 100% కాన్ఫిడెన్స్‌గా కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే ‘యాటిట్యూడ్’ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె నటించిన ‘పరదా’ ఈ నెల 22న విడుదల కానుంది.
Similar News
News August 12, 2025
తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఈనెల 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
News August 12, 2025
INDvsENG: చరిత్ర సృష్టించిన సిరీస్

ENG, IND మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ రికార్డులు తిరగరాసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక మంది వీక్షించిన టెస్ట్ సిరీస్‌గా నిలిచింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను జియో హాట్‌స్టార్‌లో 17 కోట్ల మంది తిలకించారు. ఐదో టెస్టు చివరి రోజున ఏకకాలంలో రికార్డు స్థాయిలో 1.3 కోట్ల మంది వీక్షించారు. సిరీస్ మొత్తం 65 బిలియన్ మినట్స్ వాచ్ టైమ్‌ను నమోదు చేసింది. కాగా ఈ సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే.
News August 12, 2025
ఆదాయ పరిమితిని బట్టి రిజర్వేషన్లు.. మీ కామెంట్

SC, ST, BC రిజర్వేషన్లలో అంతర్గత ఆదాయ పరిమితి విధించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆయా కులాల్లో డబ్బున్నోళ్లకు రిజర్వేషన్లు ఎందుకన్నదే పిటిషన్ ప్రధానోద్దేశం. BCల్లో క్రీమిలేయర్ ఇలాంటిదే. అయితే SC, STల్లోనూ సంపన్నులకు కాకుండా పేదలకే ఈ ఫలాలు దక్కాలన్నది పిటిషనర్ల వాదన. దీనిపై మీరేమంటారు? కొన్నేళ్లయ్యాక రిజర్వేషన్లు వద్దన్న అంబేడ్కర్ ఆశయాన్ని ఈ వాదన నెరవేర్చేనా?