News January 22, 2025
ఎలా ఆడాలో రోహిత్‌కు చెప్పక్కర్లేదు: రహానే
రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.
Similar News
News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?
తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
News February 5, 2025
మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు
TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.