News November 13, 2024
కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదు: డీకే అరుణ

TG: లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందని అనుకోవట్లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ‘కుట్ర కోణం ఉందంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? కలెక్టర్ వెళ్లినప్పుడు ఎందుకు భద్రత కల్పించలేదు? ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై సీఎంకు ఎందుకంత ప్రేమ? శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది’ అని విమర్శించారు.
Similar News
News December 10, 2025
దేశంలో పెరిగిన అమ్మాయిల సగటు వివాహ వయస్సు

దేశంలో బాలికల సగటు వివాహ వయస్సు 22.9 సంవత్సరాలకు చేరుకుందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో అమ్మాయిల సగటు వివాహ వయస్సు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో బాలికల వివాహ వయస్సు సగటున 22.1 సంవత్సరాలుగా ఉంది. ఇది 2020లో 22.7కి పెరిగింది. 2021లో ఇది 22.5 కాగా, 2022లో ఇది 22.7కి చేరుకుంది.
News December 10, 2025
ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ

భారత పర్యటనలో మెస్సీ పలు ప్రాంతాలను చుట్టేయనున్నారు. ఈ నెల 13న కోల్కతాలో అడుగుపెట్టనున్న ఆయన సాయంత్రం HYD వస్తారు. 14న ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు. 15వ తేదీ ఢిల్లీ చేరుకొని PM మోదీతో భేటీ అవుతారు. కాగా తొలిరోజు కోల్కతాలో తన అతిపెద్ద(70 అడుగుల) విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించాల్సి ఉన్నా సెక్యూరిటీ కారణాలతో ఆ ప్రోగ్రామ్ను వర్చువల్గా నిర్వహిస్తున్నారు.
News December 10, 2025
దిగుబడి పెంచే నానో ఎరువులను ఎలా వాడాలి?

దశాబ్దాలుగా సాగులో ఘన రూపంలో యూరియా, DAPలను రైతులు వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూప నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటి వాడకం వల్ల ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90% గ్రహించి, దిగుబడి పెరిగి.. పెట్టుబడి, గాలి, నేల కాలుష్యం తగ్గుతుందంటున్నారు నిపుణులు. నానో ఎరువులను ఎలా, ఎప్పుడు, ఏ పంటలకు వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


