News September 7, 2024
మోదీ మీద నాకు నమ్మకం లేదు: పునియా

రెజర్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియా మండిపడ్డారు. ప్రధాని మోదీపై తనకు నమ్మకం పోయిందన్నారు. ‘రెజ్లర్లు ఎక్కడికి వెళ్లినా మన దేశం కోసం, జెండా కోసం పోరాడుతాం. నేరస్థుడైన బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ అండగా నిలిచింది. నాపై దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించింది. డోపింగ్ ఆరోపణలతో నన్ను నిషేధించింది’ అని ఆరోపించారు.
Similar News
News February 5, 2026
వెస్ట్ బైపాస్ నుంచే వెళ్లండి.. జగన్‌కు నోటీసులు

AP: రేపు వైసీపీ అధినేత జగన్ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు తాజాగా జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ రోడ్డులో వెళ్లాలని పేర్కొన్నారు. ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా బుధవారం జగన్ గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.
News February 5, 2026
ఖర్జూరంతో ఆరోగ్యంగా వెయిట్ లాస్.. కారణమిదే!

* ఖర్జూరాలను బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.
* ఎక్కువ సమయం ఆకలి వేయదు.
* ఒకటి/రెండు తినే సరికి స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఆకలి తక్కువ వేస్తుంది.
* ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్ల కారణంగా జీవక్రియ మెరుగుపడుతుంది.
* తక్కువ క్యాలరీలు తీసుకోవడంతో హెల్తీగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది.
News February 5, 2026
రైతులకు రిటర్న్ ప్లాట్‌లు.. 16న లాటరీ

AP: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈనెల 16న ప్లాట్‌ల కేటాయింపునకు CRDA లాటరీ తీయనుంది. ఈ-లాటరీ ద్వారా రైతులకు నిబంధనల ప్రకారం ప్లాెెట్‌లు కేటాయిస్తారు. వాటిని రైతులు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


