News April 22, 2025
రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు: జగన్

ఏపీలో కూటమి సర్కార్ దుష్ట సంప్రదాయాలకు తెరతీసిందని మాజీ CM జగన్ విమర్శించారు. కుట్ర పూరితంగా YCP శ్రేణులు, పోలీసులను అరెస్ట్ చేయడం కక్ష రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలో పార్టీ PAC సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించడం లేదు. అసలు రాష్ట్రం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News April 22, 2025
CM రేవంత్ వస్తేనే నా పెళ్లి: వైరా యువకుడు

TG: CM రేవంత్ వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటానన్నాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెబుతున్నాడు. వైరాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడు MLA రామ్‌దాస్ మాలోతుకు ఓ లెటర్ రాశాడు. తన పెళ్లికి CMను తీసుకొచ్చే బాధ్యత ఆయనదేనంటూ విన్నవించాడు. ఆ లెటర్‌ను MLA కూడా CMకు పంపాడు.
News April 22, 2025
J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
News April 22, 2025
త్వరలో 18 APPSC నోటిఫికేషన్లు: ప్రభుత్వం

AP: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 18 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు APPSC రెడీగా ఉన్నట్లు వివరించింది. ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఉంటాయంది. ఈ 18 నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.