News October 25, 2024
షర్మిలతో పాదయాత్ర వద్దన్నా: పేర్ని నాని

AP: పీసీసీ చీఫ్ షర్మిల తాపత్రయమంతా వైఎస్ ఆస్తి కోసమేనని, వైఎస్ ఆశయాల కోసం కాదని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. వైఎస్ శత్రువులతో షర్మిల చేతులు కలిపారని విమర్శించారు. ‘షర్మిలను పాదయాత్ర చేయనీయొద్దని అప్పట్లోనే జగన్కు చెప్పా. కానీ ఆయన వినలేదు. ఏరోజైనా ఆమెతో చికాకులు తప్పవని అప్పుడే ఆయనను హెచ్చరించా. నేను అప్పుడు అనుమానించినవే ఇప్పుడు జరుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
మాపై అధిక పన్నులు వేయండి.. బిలియనీర్ల లేఖ

తమపై అధిక పన్నులు వేయాలంటూ 24 దేశాలకు చెందిన కుబేరులు దావోస్లో రిలీజ్ చేసిన లేఖ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘టైమ్ టు విన్.. వియ్ మస్ట్ విన్ బ్యాక్ అవర్ ఫ్యూచర్. లీడర్స్ ఎట్ దావోస్ టాక్స్ ది సూపర్ రిచ్’ అనే హెడ్డింగ్తో లేఖ రాశారు. దీనిపై 400 మంది సూపర్ రిచ్ పీపుల్ సంతకాలు చేశారు. పేదలు, అత్యంత సంపన్నుల మధ్య నానాటికీ పెరిగిపోతున్న దూరాన్ని తగ్గించడానికి తమలాంటి వారిపై అధిక పన్నులు వేయాలని కోరారు.
News January 22, 2026
బెండ, టమాటా, వంగ పంటల్లో తెగుళ్ల నివారణ

ఈ సీజన్లో కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.
News January 22, 2026
ఎండిన వారికి ఇనుము తిండి

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.


