News May 10, 2024
‘నాకు చదవాలని లేదు.. వెళ్లిపోతున్నా’
కోచింగ్ సెంటర్లకు చిరునామా అయిన రాజస్థాన్ కోటా నుంచి ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. నీట్ శిక్షణ కోసం వచ్చిన రాజేంద్ర మీనా అనే స్టూడెంట్.. తండ్రికి మెసేజ్ చేసి హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. ‘నేను ఇంటికి రాను. నాకు చదవాలని లేదు. నా దగ్గర రూ.8వేలు ఉన్నాయి. ఐదేళ్ల వరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తా. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను.. నా గురించి బాధపడకండి. ఏడాదికి ఓసారి ఫోన్ చేస్తాను’ అని తెలిపాడు.
Similar News
News December 25, 2024
అల్లు అర్జున్ కేసు: AP vs TG రంగు కరెక్టేనా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట రాజకీయ రంగు పులుముకుంటోంది. కేసులో ప్రధాన నిందితులపై కాకుండా A11 అల్లు అర్జున్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అర్జున్ VS పోలీసులు, అర్జున్ VS రేవంత్‌గా కొనసాగిన నెరేటివ్ ఇప్పుడు AP VS TGగా మారింది. కొందరు కాంగ్రెస్ నేతలు, MLAలు ఆంధ్రావాళ్ల పెత్తనం ఇక్కడేంది? కావాలంటే వెళ్లిపోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆ పార్టీ వైఖరిపై సందేహాలు కలుగుతున్నాయి. మరి మీరేమంటారు?
News December 25, 2024
మోహన్ బాబుకు మరోసారి నోటీసులు?
TG: జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు ఇంకా అజ్ఞాతం వీడలేదని తెలుస్తోంది. అరెస్టు నుంచి మినహాయిస్తూ హైకోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా నేడు ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడి కేసులో మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.
News December 25, 2024
ఆ స్కూళ్లకు 29 వరకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు మరికొన్ని రోజులు సెలవులు ఉండనున్నాయి. ఏపీలో ఈ నెల 29 వరకు, తెలంగాణలో 27 వరకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మిగతా అన్ని స్కూళ్లకు రేపు కూడా సెలవు ఉండగా, ఏపీలో ఆప్షనల్ హాలిడే ఉంది. దీని ప్రకారం కొన్ని పాఠశాలలు గురువారం కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.