News September 14, 2025
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి: విజయ్

ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని సినీ హీరో, TVK చీఫ్ విజయ్ అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి, ఎలక్షన్స్ పెట్టాలని BJP చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు. 500కుపైగా హామీలు ఇచ్చిన DMK ఎన్ని నెరవేర్చిందని ప్రశ్నించారు. కానీ CM స్టాలిన్ సిగ్గులేకుండా అన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అరియలూర్ రోడ్ షోలో ఫైరయ్యారు.
Similar News
News January 28, 2026
విమాన ప్రమాదం.. ఎవరీ శాంభవీ పాఠక్!

<<18980548>>విమాన ప్రమాదం<<>>లో అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు చనిపోవడం తెలిసిందే. వీరిలో కెప్టెన్ శాంభవీ పాఠక్ కూడా ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్ కూతురైన శాంభవి ముంబై వర్సిటీలో Bsc పూర్తి చేశారు. న్యూజిలాండ్‌లో పైలట్ శిక్షణ తీసుకున్నారు. DGCA నుంచి లైసెన్స్ పొందారు. 2022 ఆగస్టు నుంచి <<18981334>>VSR వెంచర్స్<<>>లో ఫస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. Learjet45 విమానాలు నడుపుతున్నారు. ప్రమాదంలో ఆమెతోపాటు కెప్టెన్ సుమిత్ కపూర్ కూడా మరణించారు.
News January 28, 2026
ఉపవాసం ఉంటున్నారా? ఈ తప్పులు చేయకండి!

ఉపవాసమంటే ఆహారం మానేయడం కాదు. ఆరోగ్యాన్నిచ్చే ఆధ్యాత్మిక క్రతువు. 15 రోజులకోసారే ఉపవాసముండాలి. ఆ సమయంలో అన్నం, బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యానికి దూరముండాలి. లేకపోతే ఇంట్లోకి దరిద్రం వస్తుందని పెద్దలు చెబుతారు. పూజ సమయంలో నలుపు దుస్తులు ధరించకూడదు. ఎవరితోనూ గొడవ పడకూడదు. దుర్భాషలాడకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
News January 28, 2026
విజయనగరం జిల్లాలో మెగా జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విజయనగరం జిల్లాలోని శ్రీ చైతన్య డిగ్రీ& పీజీ కాలేజీలో జనవరి 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. 17 మల్టీ నేషనల్ కంపెనీలు 975 పోస్టులను భర్తీ చేయనున్నాయి.


