News May 3, 2024
యువరాజు పారిపోతాడని ముందే చెప్పా: మోదీ

రాహుల్ గాంధీ అమేథీ నుంచి కాకుండా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘‘వయనాడ్‌లో ఓడిపోతాననే భయంతో యువరాజు(రాహుల్ గాంధీ) వేరే స్థానంలో పోటీ చేసేందుకు చూస్తున్నారని నేను ముందే చెప్పా. ఇప్పుడు అమేథీ నుంచి పారిపోయి రాయ్‌బరేలీకి వెళ్లారు. వాళ్లు దేశమంతా తిరుగుతూ భయపడకండని అందరికీ చెబుతారు. నేను కూడా కాంగ్రెస్‌కు అదే చెబుతున్నా ‘భయపడకండి.. పారిపోకండి’’ అని మోదీ పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
పిల్లలు తనకు పుట్టలేదన్న భర్త.. DNA టెస్టుకు కోర్టు నిరాకరణ

AP: భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించడానికి తన ఇద్దరు పిల్లలకు DNA పరీక్ష నిర్వహించాలంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆ పిల్లలు తనకు పుట్టలేదన్న వాదనను తోసిపుచ్చింది. ఇది పిల్లల గౌరవానికి సంబంధించిన అంశమని, బలమైన కారణం లేకుండా DNA టెస్టుకు ఆదేశించలేమని తేల్చి చెప్పింది. భార్య తనను విడిచి వెళ్లిందని తొలుత భర్త విడాకుల పిటిషన్ వేశారని, అక్రమ సంబంధం గురించి కాదని పేర్కొంది.
News March 19, 2026
పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.
News March 19, 2026
BREAKING: జాబ్ క్యాలెండర్ విడుదల

AP: 10,060 పోస్టులతో మంత్రి లోకేశ్ <<19422647>>జాబ్ క్యాలెండర్<<>> విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ ‘<


