News October 7, 2025
స్వీట్లు తిన్నప్పుడల్లా పక్షవాతం.. ఎందుకంటే?

తీపి తిన్న ప్రతిసారీ ఓ 33 ఏళ్ల వ్యక్తికి పక్షవాతం వచ్చినట్లు కాళ్లు, చేతులు బలహీనపడటం చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అలాగే చల్లని వాతావరణంలోనూ ఈ బలహీనత 3 రోజులు ఉండి తర్వాత తగ్గిపోతోంది. ఇది ‘హైపోకలేమిక్ పిరియాడిక్ పెరాలసిస్’ వ్యాధి అని వైద్యులు తెలిపారు. స్వీట్స్/కార్బ్స్ వల్ల వీరి శరీరంలో పొటాషియం స్థాయులు పడిపోయి, తాత్కాలిక పక్షవాతం వస్తుంది. ఔషధాలతో అతని పరిస్థితి మెరుగుపడింది.
Similar News
News March 13, 2026
హార్ముజ్‌లో నౌకలకు రక్షణ ఇవ్వలేం.. చేతులెత్తేసిన అమెరికా!

హార్ముజ్ జలసంధిని దాటుకొని నౌకలు <<19338961>>ధైర్యంగా వెళ్లాలని<<>> చెప్పిన అమెరికా ఇప్పుడు చేతులెత్తేసింది. ‘హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పించలేం. ప్రస్తుతానికి మేం రెడీగా లేము. ఇరాన్‌పై దాడులు చేయడంపైనే మా సైన్యం దృష్టి ఉంది. ఈ నెలాఖరుకు ఎస్కార్ట్ కల్పించే ఛాన్స్ ఉంది’ అని US ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ చెప్పారు. ఇవాళ US షిప్‌పై ఇరాన్ <<19364482>>దాడి చేయడం<<>> తెలిసిందే.
News March 13, 2026
65 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు: రేవంత్

TG: వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన చికిత్స అందించాలని CM రేవంత్ అన్నారు. ప్రైవేట్ రంగంలోని డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేయాలని చెప్పారు. ‘రాష్ట్రంలో 65L మంది హెల్త్ డేటా తయారు చేస్తున్నాం. వాళ్లకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తాం’ అని తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్‌కు చికిత్స పైనా దృష్టి పెట్టామన్నారు.
News March 13, 2026
CECపై అవిశ్వాసం.. రేపు నోటీసులు?

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు పార్లమెంటులోని ఏదో ఒక సభలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండు సెట్ల నోటీసులపై 193 మంది(130 లోక్‌సభ, 63 రాజ్యసభ) ఎంపీలు సంతకం చేసినట్లు సమాచారం. CECపై 7 ఆరోపణలు చేసినట్లు ప్రతిపక్ష వర్గాలు చెప్పాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని కోరుతూ నోటీసు ఇవ్వడం ఇదే తొలిసారి కానుంది.


