News March 10, 2025
ఉద్యమకారిణిగా నాకు అవకాశం వచ్చింది: విజయశాంతి

TG: MLC పదవి అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదని, ఉద్యమకారిణిగా తనకు కాంగ్రెస్ ఆ పదవి ఇచ్చిందని విజయశాంతి వెల్లడించారు. ‘మేమే అసలైన ఉద్యమకారులం. KCRను ఓడించేందుకు BJP గతంలో నన్ను ఆహ్వానించింది. కానీ BJP-BRS మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. అందుకే కమలం పార్టీ నుంచి బయటకు వచ్చాను. BC మహిళా నేతగా నన్ను కాంగ్రెస్‌లో గుర్తించారు. క్యాబినెట్‌లోకి తీసుకోవడం అనేది పార్టీ నిర్ణయిస్తుంది’ అని ఆమె చెప్పారు.
Similar News
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.
News November 7, 2025
ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.
News November 7, 2025
USలో అనుమానిత పౌడర్‌తో సైనికుల అస్వస్థత

అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్‌బేస్‌లో కెమికల్ పౌడర్‌తో సైనికులు అస్వస్థతకు గురయ్యారు. బేస్‌కు గురువారం వచ్చిన పార్శిల్‌ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్లాక్‌ను సీల్ చేసి, సమీప భవనాల్లో స్టాఫ్‌ను ఖాళీ చేయించారు. ఆ పౌడర్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుతోంది.


