News December 22, 2024

ఆ అవకతవకల్లో నా ప్రమేయం లేదు: మాజీ క్రికెటర్

image

తనపై <<14941111>>నమోదైన కేసుపై<<>> మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. తాను పెట్టుబడి పెట్టాననే కారణంతోనే సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్‌ పదవి తనకు ఇచ్చారని చెప్పారు. అయితే తానెప్పుడూ ఆ సంస్థలో యాక్టివ్‌గా లేనని తెలిపారు. కొన్నేళ్ల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఎఫ్ నిధుల అవకతవకల్లో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

Similar News

News November 20, 2025

AP న్యూస్ రౌండప్

image

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్‌కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్‌లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్

News November 20, 2025

ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

image

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్‌తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.

News November 20, 2025

IBPS క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

అక్టోబర్ 4,5,11 తేదీల్లో నిర్వహించిన ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు <>వెబ్‌సైట్‌లో<<>> తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈనెల 29న మెయిన్స్ జరగనున్నాయి. కాగా 13,533 పోస్టులను IBPS భర్తీ చేయనుంది.