News July 30, 2024
నాకు 100 మంది పిల్లలు: టెలిగ్రామ్ సీఈఓ

తనకు ఇంకా పెళ్లి కాలేదని, కానీ 100 మంది పిల్లలు ఉన్నారని టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ తెలిపారు. ‘15 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ నన్ను వింత సాయం కోరాడు. తన మిత్రుడు, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వీర్యదానం చేయమన్నాడు. తొలుత నవ్వుకున్నా ఆ తర్వాత సమస్య తీవ్రత అర్థమైంది. ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తించా. అందుకే 12 దేశాల్లోని 100 జంటలకుపైగా స్పెర్మ్ డొనేట్ చేశా’ అని పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
కీలక అంశంపై చర్చ.. ఎవరికి వారే యమునా తీరే!

TG: నీటి వాటాలో రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం కీలక చర్చ పెట్టింది. కానీ దీనికి ఒకరోజు ముందే BRS సమావేశాలను బహిష్కరించింది. ఇవాళ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే అధికార కాంగ్రెస్ MLAలే సభలో కూర్చోకుండా లాబీల్లో చక్కర్లు కొట్టారు. దీనిపై స్వయంగా CM రేవంత్ సీరియస్ అయ్యారు. అటు చర్చ సందర్భంగా పలువురు BJP ఎమ్మెల్యేలు సభలో నిద్రపోయారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
News January 3, 2026
గొర్రెల పెంపకం – విస్తృత పద్ధతి అంటే ఏమిటి?

గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, గొర్రెల కాపరులు ఆచరించే పద్ధతి ఇది. గొర్రెలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట పొలాల్లో, బంజరు భూమి, అటవీ ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో మేసి రాత్రి ఇంటికి వస్తాయి లేదా పంట పొలాల్లోనే ఎరువు కొరకు మంద కడతారు. గొర్రెలకు ప్రత్యేకంగా పాక ఉండదు. ఈ పద్ధతిలో ఖర్చు తక్కువ, గాలి వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఎండకు, వానకు, చలి నుంచి జీవాలకు రక్షణ, అన్ని కాలాల్లో గడ్డి దొరకదు.
News January 3, 2026
ఉద్యోగ వేటలో మహిళల పోటాపోటీ

ఉద్యోగాలకు పోటీ పడడంలో మహిళల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ‘అప్నా డాట్ కో’ ప్రకారం 2025లో దేశంలో 14L ఉద్యోగాలకు 9 కోట్ల మంది దరఖాస్తు చేశారు. వారిలో 3.8 కోట్ల మంది(40%) మహిళలే ఉన్నారు. 2024తో పోలిస్తే వీరి సంఖ్య 36% పెరిగింది. ఫైనాన్స్, హెల్త్కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో మేనేజర్, లీడర్షిప్ రోల్ పోస్టులకు ఎక్కువగా పోటీపడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 10L చిన్న, మధ్య తరహా, 4L పెద్ద కంపెనీలవి ఉన్నాయి.


