News February 1, 2025

శోభిత అభిప్రాయాలంటే నాకు చాలా గౌరవం: నాగచైతన్య

image

భార్య శోభిత సలహాల్ని తాను అనుసరిస్తుంటానని నటుడు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడైనా గందరగోళంగా ఉన్నప్పుడు నా ఆలోచనను శోభితతో పంచుకుంటుంటాను. ఒత్తిడిలో ఉన్నానంటే ఇట్టే గుర్తుపట్టేసి ఏమైందని అడుగుతుంది. తను ఎప్పుడూ ప్రశాంతంగా, చక్కగా ఆలోచిస్తుంది. మంచి సలహాలిస్తుంది. అందుకే తన అభిప్రాయాల్ని నేను చాలా గౌరవిస్తాను’ అని కొనియాడారు.

Similar News

News February 1, 2025

తర్వాతి మ్యాచ్‌లో షమీని ఆడిస్తాం: మోర్కెల్

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా రేపు జరిగే ఆఖరి మ్యాచ్‌లో షమీని ఆడించనున్నట్లు భారత బౌలింగ్ కోచ్ మోర్కెల్ తెలిపారు. ‘షమీ చాలా బాగా ఆడుతున్నారు. వార్మప్ గేమ్స్‌లో శరవేగంగా బౌలింగ్ చేస్తున్నారు. వచ్చే మ్యాచ్‌కి ఆయన్ను ఆడిస్తాం. ఆ అనుభవం యువ ఆటగాళ్లకు కీలకం’ అని పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ షమీకి భారత జట్టులో వరుస అవకాశాలివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

News February 1, 2025

ఎన్నికల దృ‌ష్ట్యా బడ్జెట్ రూపకల్పన?

image

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ఢిల్లీ, బిహార్‌ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో విద్యాధికులు, ఉద్యోగుల ప్రభావమే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఆదాయ పన్ను భారీ మినహాయింపును ప్రకటించిందని అంటున్నారు. ఇక బిహార్‌ ఎన్నికల దృ‌ష్ట్యా ఇబ్బడి ముబ్బడిగా పలు మార్గాల్లో నిధుల్ని కేటాయించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీ అభిప్రాయం?

News February 1, 2025

బడ్జెట్ నిరాశకు గురిచేసింది: సురేఖ

image

TG: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ‘ఈ బడ్జెట్ చాలా నిరాశకు గురిచేసింది. దేశంలోని కొత్త రాష్ట్రమైన తెలంగాణకు బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు రాలేదనే బాధను వ్యక్తపరచడానికి నాకు మాటలు రావడం లేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పంపిన అభ్యర్థనలను పట్టించుకోలేదు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించారు’ అని Xలో ఆమె ఫైరయ్యారు.