News March 16, 2025
మానసికంగా ధైర్యం కోల్పోయా: మంత్రి సీతక్క

TG:సోషల్ మీడియాలో తనపై పెట్టిన పోస్టులకు మానసికంగా ధైర్యం, కోల్పోయానని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పనిచేసే మహిళల ధైర్యాన్ని సోషల్ మీడియా, పోస్టులు దెబ్బ తీస్తాయన్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా ఎదుర్కొవాలి గానీ, సామాజిక మాధ్యమాలతో తప్పుడు ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ చేసిన మార్చురీ వ్యాఖ్యలు వ్యక్తిని కాదు పార్టీని ఉద్దేశించనవని మంత్రి స్పష్టం చేశారు.
Similar News
News March 16, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 82,580 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News March 16, 2025
శ్రీచైతన్య స్కూల్లో ఘర్షణ.. భవనంపై నుంచి కింద పడ్డ బాలిక

తిరుపతిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఓ విద్యార్థిని రెండో ఫ్లోర్ నుంచి కింద పడిపోవడం కలకలం రేపింది. విద్యార్థినుల మధ్య గొడవ జరిగిన సమయంలో తోటి విద్యార్థిని ఆమెను పైనుంచి తోసేసిందని సమాచారం. కిందపడిన బాలికకు నడుం విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. ఘటనపై తిరుపతి అర్బన్ తహశీల్దార్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
News March 16, 2025
నేడు మాస్టర్స్ లీగ్ ఫైనల్

వివిధ దేశాల దిగ్గజ విశ్రాంత క్రికెటర్లు ఆడుతున్న మాస్టర్స్ లీగ్ తుది దశకు చేరుకుంది. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు సచిన్, విండీస్‌కు లారా కెప్టెన్లుగా ఉన్నారు. గ్రూప్ దశలో ఐదింట నాలుగు గెలిచిన భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటు సచిన్, యువీ.. అటు సిమన్స్, డ్వేన్ స్మిత్ మెరుపులు మెరిపిస్తుండటంతో ఫైనల్ ఆసక్తికరంగా మారింది.