News March 22, 2025
నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్

AP: తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కులం, మతం పాటించలేదని చెప్పారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించా. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటిస్తా. క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News March 25, 2025
ఏప్రిల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: చంద్రబాబు

AP: ఏప్రిల్ మొదటివారంలో DSC నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం. 2027నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
News March 25, 2025
రైతుల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ అవుతున్నాయి: SC

దేశంలో రైతుల బలవన్మరణాల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2021లో 13000 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొంది. వాటి నివారణకు నేషనల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్న కేసు నేపథ్యంలో సుప్రీం ఈమేరకు వ్యాఖ్యానించింది.
News March 25, 2025
మీర్పేట్ మర్డర్ కేసులో కీలక పురోగతి

TG: మీర్పేట్ మాధవి మర్డర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇంట్లో లభించిన టిష్యూస్తో మాధవి DNA మ్యాచ్ అయినట్లు పోలీసులకు రిపోర్ట్ అందింది. టిష్యూస్ను DNA టెస్టుకు పంపగా మాధవి పిల్లల DNAతో అవి సరిపోలినట్లు తేలింది. కాగా రిటైర్డ్ జవాన్ గురుమూర్తి అనుమానంతో భార్య మాధవిని హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టాడు. ఎముకలు పొడి చేసి చెరువులో పడేశాడు.