News March 25, 2025

నేనెప్పుడు కేసీఆర్‌ను కించపరచలేదు: జూపల్లి

image

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

image

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.

News October 14, 2025

RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం

image

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.

News October 14, 2025

అరిషడ్వర్గాలను తొలగించే ఆరు నియమాలు

image

కృష్ణుడికి ఇష్టమైన కార్తీక దామోదర మాసంలో ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. మన ప్రేమకు ఆయన బందీ అవుతాడని పండితులు చెబుతున్నారు. ప్రార్థన, మహామంత్ర జపం, దామోదర లీలా పఠనం, సాత్విక నివేదన, దీపారాధన, దామోదరాష్టకం పఠనం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని అంటున్నారు. ఈ 6 నియమాలు పాటిస్తే మనలోని అరిషడ్వర్గాలు తొలగి, శ్రీకృష్ణ కటాక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. ఇల్లు గోకులంగా వెలుగొందుతుందని అంటున్నారు.