News August 21, 2024
అలాంటి ఇన్నింగ్స్ నా జీవితంలో చూడలేదు: షాహీన్ అఫ్రీది
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724209712280-normal-WIFI.webp)
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీది కొనియాడారు. ‘నా కెరీర్ మొత్తంలో అలాంటి ఇన్నింగ్స్ చూడలేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, తొలుత పాక్ 159 రన్స్ చేయగా విరాట్ 53 బంతుల్లో 82 రన్స్ చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించారు.
Similar News
News February 12, 2025
పోలీసులకు పృథ్వీ ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739367513581_81-normal-WIFI.webp)
YCP సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని HYD సైబర్‌క్రైమ్ పోలీసులకు నటుడు పృథ్వీ రాజ్ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన <<15435022>>వ్యాఖ్యల <<>>తర్వాత ఫోన్లు, మెసేజ్‌లతో ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, 1800 కాల్స్ చేయించారని వివరించారు. తనను వేధించిన వారిపై రూ.కోటి పరువునష్టం దావా వేస్తానని, AP హోంమంత్రికీ ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
News February 12, 2025
అమ్మాయిలూ.. క్యాబ్ బుక్ చేస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344809482_746-normal-WIFI.webp)
ఉబర్‌లో క్యాబ్ బుక్ చేసిన ఓ మహిళకు డ్రైవర్ వాట్సాప్‌లో అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించి ఇబ్బందికి గురిచేశాడు. కేరళలోని కట్రికడావులో ఓ మహిళ ‘ఉబర్’లో క్యాబ్ బుక్ చేసింది. అయితే, రెండు రోజుల తర్వాత ఆమె వాట్సాప్‌కు అపరిచిత వ్యక్తి నుంచి ‘మీరు వాడే స్ప్రే ఏ కంపెనీ’ అని మెసేజ్‌లు రావడంతో ఆమె అతణ్ని బ్లాక్ చేసింది. ట్విటర్లో ఈ విషయాన్ని ‘ఉబర్’కు తెలియజేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ వైరలవుతోంది.
News February 12, 2025
వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720797697-normal-WIFI.webp)
TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.