News September 8, 2024
హైదరాబాద్లో నాకు భవనాలే లేవు: కాటసాని

TG: ‘హైడ్రా’ కూల్చివేసిన భవనం తనది కాదని ఏపీలోని పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. తనకు హైదరాబాద్లో భవనాలే లేవన్నారు. కొందరు టీడీపీ నేతలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానే హైడ్రాకు నోటీసులు పంపిస్తానని కాటసాని వెల్లడించారు. కాగా అమీన్పూర్ పెద్దచెరువు FTLలో కాటసాని అక్రమ నిర్మాణాలను కూల్చి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు.
Similar News
News November 22, 2025
మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే?

ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చుట్టాలతో, పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళల మాటతీరు గట్టిగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు అతిథులు ఈ మాటతీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాటతీరు తియ్యగా, వినస్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరం ఉండాలని ఇలా చేశారు.
News November 22, 2025
కోర్టులో రహస్య చిత్రీకరణపై చర్యలు తీసుకోవాలి: YCP మాజీ MLA

AP: CBI కోర్టు జడ్జి ముందు YS జగన్ నిలబడి ఉండగా రహస్యంగా వీడియో చిత్రీకరించి కుట్రతో వైరల్ చేస్తున్నారని YCP మాజీ MLA సుధాకర్బాబు విమర్శించారు. దీనిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ ఎక్కడికెళ్లినా వేలాది మంది వస్తుండడంతో అక్కసుతో ఇలా వ్యక్తిత్వ హననానికి దిగజారారని మండిపడ్డారు. CBN జైల్లో ఉండగా ఫొటోల వంటివీ బయటకు రాకుండా నాటి జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని కాపాడిందన్నారు.
News November 22, 2025
రబీ రాగులు సాగు – అనువైన దీర్ఘకాలిక రకాలు

రబీలో ఆరుతడి పంటగా తేలిక రకం ఇసుక, బరువైన నేలల్లో డిసెంబర్ చివరి వరకు రాగులును సాగు చేయవచ్చు. రాగులులో గోదావరి, రత్నగిరి అన్ని ప్రాంతాల్లో సాగుకు అనువైన దీర్ఘకాలిక రకాలు. ☛ గోదావరి: పంటకాలం 120-125 రోజులు. అగ్గి తెగులును తట్టుకొని ఎకరాకు 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛రత్నగిరి: అధిక పోషక విలువలు గల రకం. పంటకాలం 115-125 రోజులు. అగ్గితెగులును తట్టుకొని ఎకరాకు 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.


