News December 10, 2024

నేను ఏ పార్టీ మారలేదు: ఆర్.కృష్ణయ్య

image

AP: రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లలేదని, వాళ్లే పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా బీసీల కోసమే పనిచేస్తానని తెలిపారు. కేంద్రంలో బీసీల నాయకత్వమే ఎక్కువని, రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు అవకాశమిచ్చిన మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News December 12, 2025

మహిళా జర్నలిస్టుతో శశిథరూర్.. వైరలవుతున్న ఫొటోలు

image

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఓ మహిళా జర్నలిస్టుతో ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. థరూర్‌ భుజంపై ఆమె చేతులు వేసి ఉన్న పోజ్‌పై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. కాగా ఆమె పేరు రంజున్ శర్మ. రష్యా రాజధాని మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ థరూర్ లేదా రంజున్ ఈ విషయంపై స్పందించలేదు.

News December 12, 2025

హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి 20 ఏళ్ల జైలు

image

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ <<18502408>>కేసులో<<>> ఆరుగురు నిందితులకు కేరళ ఎర్నాకుళం స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన నటుడు దిలీప్‌ను ఇటీవలే న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. మిగతా నిందితులైన సునీల్, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజీశ్, సలీమ్, ప్రదీప్‌కు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 2017లో హీరోయిన్‌పై గ్యాంగ్‌రేప్ దేశవ్యాప్తంగా సంచలనమైంది.

News December 12, 2025

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అమరావతి బిల్లు!

image

అమరావతి రాజధాని చట్టబద్ధత అంశం శుక్రవారం కేంద్ర క్యాబినెట్లో చర్చకు రాలేదు. AP నుంచి మరింత సమాచారం తీసుకుని క్యాబినెట్లో ఆమోదించి అనంతరం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కాగా సాంకేతిక సమస్యల పరిష్కారంపై AP కసరత్తు చేపట్టింది. 2014-2024 వరకు అమరావతినే రాజధానిగా గుర్తించేలా అది అధ్యయనం చేస్తోంది. ఫ్యూచర్లో రాజధానిని మార్చకుండా ఒకే క్యాపిటల్ ఉండేలా చర్య తీసుకుంటోంది.