News August 28, 2024
నేను పార్టీ మారట్లేదు: విజయసాయి రెడ్డి

AP: తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. తానెప్పుడూ వైసీపీతోనే ఉంటానని స్పష్టం చేశారు. ‘నేను విధేయత, అంకితభావం, నిబద్ధత కలిగిన YSRCP కార్యకర్తను. నేను YSRCPలోనే ఉంటాను. వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తాను’ అని ట్వీట్ చేశారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలు వైసీపీని వీడి కూటమి పార్టీల్లోకి చేరుతారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News January 3, 2026
ఇందిరమ్మ ఇళ్లకూ ఫ్రీ కరెంట్: భట్టి విక్రమార్క

TG: కొత్తగా ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి కూడా ఉచిత కరెంట్ అందిస్తామని Dy.CM భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే MPDO, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించొచ్చని వెల్లడించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే మాత్రం పథకం వర్తించదని తేల్చి చెప్పారు. ఫ్రీ కరెంట్ ద్వారా రాష్ట్రంలో 50%పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని చెప్పారు.
News January 3, 2026
ముంబై పోర్ట్ అథారిటీలో పోస్టులు

<
News January 3, 2026
ప్రాణం తీసిన క్యాబేజీ టేప్‌వార్మ్.. వండకముందు ఇలా చేయకపోతే డేంజరే!

క్యాబేజీలో ఉండే Tapeworm(బద్దెపురుగు) ప్రాణాంతకంగా మారడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఒక విద్యార్థిని వీటివల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్కు గురై మరణించారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, వంకాయ వంటి కూరగాయలను సరిగ్గా కడగకుండా తింటే ఈ పురుగుల గుడ్లు రక్తంలో కలిసి మెదడుకు చేరతాయి. దీనివల్ల ఫిట్స్, తీవ్రమైన తలనొప్పి వస్తాయి. కూరగాయలను బాగా కడిగి పూర్తిగా ఉడికించి తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


