News March 22, 2024
నేను పార్టీ మారట్లేదు: వైసీపీ ఎంపీ చింతా అనురాధ

AP: తాను బీజేపీలోకి <<12896599>>వెళ్తున్నట్లు<<>> వచ్చిన వార్తలను అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధ ఖండించారు. ‘నేను పార్టీ మారట్లేదు. గత ఎన్నికల్లో నన్ను గెలిపించేంత వరకు సీఎం జగన్ చేసిన సాయం మరువలేనిది. ఈ ఐదేళ్లు ఎంతో అండగా నిలిచారు. ఆయనను నమ్ముకున్న వారికి భరోసాగా ఉంటారు. బీజేపీ అభ్యర్థిగా రేసులో ఉన్న వ్యక్తికి, మా కుటుంబానికి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 20, 2025
ఉద్యోగ యోగాన్ని కల్పించే ‘బెంగళూరు గణేష్’

బెంగళూరు జయనగర్లోని కెరీర్ వినాయక ఆలయం నిరుద్యోగుల పాలిట కల్పవృక్షం. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, పదోన్నతులు కోరేవారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఆటంకాలు తొలగి కార్యసిద్ధి జరుగుతుందని నమ్మకం. సంకల్ప పూజలు, ప్రదక్షిణలతో నిరుద్యోగులు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారని ప్రగాఢ విశ్వాసం. విద్యావంతులు, యువతతో ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి భరోసాను కల్పిస్తోంది.
News December 20, 2025
రూ.500 కోట్ల క్లబ్లో ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ ధురంధర్ వసూళ్ల వండర్ సృష్టించింది. INDలో విడుదలైన 15 రోజుల్లోనే రూ.500Cr కొల్లగొట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే ఈ క్లబ్లో చేరిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లోనూ 3వ స్థానానికి చేరింది. తొలి 2 స్థానాల్లో కాంతార ఛాప్టర్-1(రూ.622Cr), ఛావా(601Cr) ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్గా ఈ చిత్రం రూ.700Cr రాబట్టింది.
News December 20, 2025
వైస్ కెప్టెన్నే పక్కన పెట్టేశారు..

గత కొంతకాలంగా టీ20ల్లో రన్స్ చేయలేక విఫలం అవుతున్న గిల్ను బీసీసీఐ పక్కనబెట్టింది. వచ్చే ఏడాది జరగబోయే WCకు ఎంపిక చేయలేదు. ప్రస్తుత వైస్ కెప్టెన్, ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్న గిల్నే సెలక్ట్ చేయకపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సరిగా ఆడకపోతే ఇదే సరైన ట్రీట్మెంట్ అని కొందరు సెలక్షన్ కమిటీని అభినందిస్తున్నారు. కాగా గిల్ గత 22 టీ20 ఇన్నింగ్సుల్లో 529 పరుగులే చేశారు. సగటు 26.45గా ఉంది.


