News January 20, 2025
నేను నేరం చేయలేదు: సంజయ్ రాయ్

తాను తప్పు చేయలేదని కలకత్తా హత్యాచార ఘటన దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తీర్పు ఖరారుపై కాసేపటి క్రితం సీల్దా కోర్టులో వాదనలు ప్రారంభం కాగా, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నాడు. కాగా 2024 AUG 9న RG Kar ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ దారుణ హత్యాచారానికి గురైంది. ఆ మరుసటి రోజు మాజీ పోలీస్ కాంట్రాక్టు ఉద్యోగి <<15203033>>సంజయ్<<>> ఈ కేసులో అరెస్టయ్యాడు.
Similar News
News November 27, 2025
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.
News November 27, 2025
ప్రపంచంలోనే తొలిసారి.. సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్

అన్ని దేశాల్లో డెంగ్యూ కేసులు పెరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ సైంటిస్టులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే తొలిసారి సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. Butantan-DV అనే ఈ టీకాను 12-59 ఏళ్ల ప్రజలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం డెంగ్యూకు TAK-003 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. WHO నిబంధనల ప్రకారం 3 నెలల వ్యవధిలో రెండుసార్లు వేసుకోవాలి.
News November 27, 2025
చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్

ఇండియన్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. తాజా వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో స్వర్ణం గెలిచారు నిఖత్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత విరామం తీసుకున్న నిఖత్, తిరిగి రింగ్‌లో అడుగుపెట్టి తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. దాదాపు 21 నెలల తర్వాత అంతర్జాతీయ వేదికపై నిఖత్ పతకం సాధించడం విశేషం. ఈ మెడల్ భారత మహిళా బాక్సింగ్‌లో మరో మైలురాయిగా నిలిచింది.


