News November 4, 2024
నేనెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు: హర్షసాయి

డబ్బు తీసుకుని మోసం చేశారంటూ తనపై ఓ యువతి చేసిన ఆరోపణలను యూట్యూబర్ హర్షసాయి ఖండించారు. ఈ కేసులో TG హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొన్ని వారాలుగా విదేశాల్లో ఉన్న అతను ఇవాళ HYD తిరిగొచ్చారు. ‘నేనెవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. డిమాండ్ చేయలేదు. నేను తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడిగారు. రూ.2 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేశారు. నిజాలు బయటికొచ్చాయి కాబట్టే బెయిల్ వచ్చింది’ అని చెప్పారు.
Similar News
News December 16, 2025
మోదీతో భేటీ అంశాలు లీక్.. కిషన్ రెడ్డి ఆగ్రహం

ప్రధాని మోదీతో తెలంగాణ BJP MPల సమావేశానికి <<18530988>>సంబంధించిన లీకులపై<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘PMతో భేటీ విషయాలను లీక్ చేసిన వ్యక్తులు మెంటల్ వాళ్లు. మీటింగ్ విషయాలు బయట చెప్పొద్దని PM చెప్పారు. అయినా వాటిని లీక్ చేశారు. వారెవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు’ అని మీడియాతో చిట్‌చాట్‌లో పేర్కొన్నారు.
News December 16, 2025
ఎగ్జామ్ ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఫస్ట్, సెకండియర్ చదివే జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టింది. రూ.5వేల ఫైన్‌తో ఈ నెల 22 నుంచి JAN 5 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గత నెలలోనే గడువు ముగిసింది.
News December 16, 2025
పెళ్లి వార్తలను ఖండించిన హీరోయిన్ మెహ్రీన్

తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను హీరోయిన్ మెహ్రీన్ ఖండించారు. ఓ వ్యక్తితో తనకు పెళ్లి జరగబోతున్నట్లు ఆర్టికల్స్ రాశారని, కానీ అతనెవరో తనకు తెలియదని, ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ఒకవేళ తాను నిజంగా మ్యారేజ్ చేసుకుంటే అందరికీ తెలియజేస్తానని పేర్కొన్నారు. ఫేక్ ఆర్టికల్స్ రాయడంపై ఫైరయ్యారు. పొలిటీషియన్ భవ్య బిష్ణోయ్‌తో ఆమెకు 2021లో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత పెళ్లి రద్దయింది.


