News May 21, 2024
ఆ రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు: కాకాణి
AP: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అక్కడ దొరికిన కారుతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని పేర్కొన్నారు. కాగా.. కాకాణి కనుసన్నల్లోనే ఈ రేవ్ పార్టీ జరిగిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు.
Similar News
News December 25, 2024
హైదరాబాద్ వాసుల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే!
TG: హైదరాబాదీలు బ్రేక్‌ఫాస్ట్‌గా దోశ ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లిదోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ తెలిపింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసేది హైదరాబాద్ వాసులే అని ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ నివేదికలో వివరించింది. అలాగే ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు తెలిపింది. అటు, హైదరాబాదీల ఫేవరెట్ స్వీటుగా ‘డబుల్ కా మీటా’ నిలిచింది.
News December 25, 2024
పల్నాడు జిల్లాలో 1న సీఎం పర్యటన
AP: CM చంద్రబాబు నూతన సంవత్సరంలో తొలి రోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నరసరావుపేటలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. తొలుత గురజాలలో పర్యటించాలని అనుకున్నా.. BC ఎమ్మెల్యే ఉన్నచోట కార్యక్రమం నిర్వహించాలని అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో నరసరావుపేటకు మార్చినట్లు తెలుస్తోంది. రొంపిచర్ల మండలం అన్నవరంలో CBN పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
News December 25, 2024
సర్పంచులు, ఎంపీటీసీలకు గుడ్ న్యూస్
TG: గ్రామాల్లో సర్పంచులు, MPTCలు, ZPTCలు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. BRS పెట్టిన బకాయిలు ₹1,300కోట్లు ఉన్నాయన్నారు. తొలుత ₹10లక్షల లోపు బిల్లులను సెటిల్ చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బకాయిల విలువ దాదాపు ₹400కోట్లు ఉందని తెలిపారు. బిల్లులను పెండింగ్‌లో పెట్టిన BRS నేతలు మళ్లీ ధర్నాలు చేస్తామనడం సమంజసం కాదన్నారు.