News March 28, 2024

కేసీఆర్‌పై గౌరవం ఉంది.. కాంగ్రెస్‌లోకి వెళ్తున్నా: కేకే

image

TG: పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందించారు. ‘కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్‌పై గౌరవం ఉంది. అయినా కాంగ్రెస్‌లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా. అదే విషయం కేసీఆర్‌కు చెప్పా. కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కాగా కేకే ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరనున్నారు.

Similar News

News April 14, 2026

కోర్టుల్లో బెంచ్‌ల గురించి తెలుసా?

image

సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్, కాన్‌స్టిట్యూషన్ బెంచ్, లార్జర్ బెంచ్, త్రీ జడ్జి బెంచ్‌లు ఉంటాయి. డివిజన్ బెంచ్‌లో ఇద్దరు న్యాయమూర్తులు ఉంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ అప్పీళ్లను విచారిస్తారు. కాన్‌స్టిట్యూషన్ బెంచ్‌లో కనీసం ఐదుగురు జడ్జిలు ఉంటారు. ఇది శాశ్వతం కాదు. కేసు తీవ్రతను బట్టి CJI ఏర్పాటు చేస్తారు. హైకోర్టుల్లో సింగిల్, డివిజన్, ఫుల్, లార్జర్ బెంచ్‌లు ఉంటాయి.

News April 14, 2026

T20 కెప్టెన్‌గా సూర్య కొనసాగుతారా?

image

భారత T20 కెప్టెన్‌గా సూర్య ఎప్పటివరకు కొనసాగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన కెప్టెన్సీలోనే భారత్ T20 WC గెలిచింది. కానీ బ్యాటింగ్‌లో ఆయన తడబడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్, జులైలో ENG, IREతో జరిగే T20 సిరీస్‌లలో ఆయన ఎలా ఆడతారనే దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సిరీస్‌లలో రాణిస్తే ఆయన 2028 ఒలింపిక్స్ వరకూ కెప్టెన్‌గా కొనసాగే అవకాశముందని అంటున్నారు.

News April 14, 2026

కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టేలా పరీక్షలు: మంత్రి

image

AP: ఉద్ధానం వాసులను పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధిని ముందే పసిగట్టి ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘‘బయోమార్కర్స్’ ద్వారా జన్యు, రక్త, మూత్ర పరీక్షలను ప్రత్యేక బృందాలతో నిర్వహిస్తున్నాం. ఇందుకు ICMR ₹6.2CR ఇచ్చింది. వ్యాధి వచ్చే అవకాశాలను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పలాస రీసెర్చ్ కేంద్రం సహా విశాఖ KGHలో ప్రత్యేక ల్యాబ్‌లు నెలకొల్పాం’ అని తెలిపారు.