News August 24, 2024

ఆ స్వేచ్ఛ నాకుంది: వివేక్ అగ్నిహోత్రి

image

న‌చ్చిన స‌బ్జెక్ట్‌ను ఎంచుకొని సినిమా తీసే స్వేచ్ఛ త‌న‌కుంద‌ని ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ది క‌శ్మీర్ ఫైల్స్ అనంత‌రం ద్వేషాన్ని వ్యాప్తి చేసే సినిమాల ద‌ర్శ‌కుడిగా ఆయ‌న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గ‌తంలో ఆయ‌న తీసిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’1966లో ఉజ్బెకిస్థాన్‌లో PM లాల్ బహదూర్ శాస్త్రి మరణం చుట్టూ తిరుగుతుంది. తాజాగా అవిభక్త బెంగాల్ హింసాత్మక చరిత్ర పై ‘ది ఢిల్లీ ఫైల్స్’ తీస్తున్నారు.

Similar News

News December 4, 2025

వనపర్తి: 45 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

image

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు బుధవారం మొత్తం 45 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావిలోని 17 GPలకు – 9 నామినేషన్లు.
✓ పానగల్‌లోని 28 GPలకు – 15 నామినేషన్లు.
✓ పెబ్బేరులోని 20 GPలకు – 13 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్‌లోని 8 GPలకు – 6 నామినేషన్లు.
✓ వీపనగండ్లలోని 14 GPలకు – 2 నామినేషన్లు దాఖలయ్యాయి.

News December 4, 2025

పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

image

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్‌ ఫాస్పెట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.

News December 4, 2025

హనీమూన్ వెకేషన్‌లో సమంత-రాజ్!

image

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.