News May 24, 2024

ఇవాళ ఎలాగైనా కొట్టాలి భయ్యా!

image

ఫైనల్ చేరాలంటే ఇవాళ RRపై SRH తప్పక గెలవాలి. ఈ సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో ట్రావిస్ హెడ్‌ది కీలక పాత్ర. కానీ గత 2 మ్యాచుల్లో అతడు డకౌట్ అవడం SRH అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. PBKS, KKRతో మ్యాచుల్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్‌లోనే హెడ్ ఔట్ అయ్యాడు. ఇవాళ RR టీమ్‌లోనూ బౌల్ట్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. కానీ తన బలహీనతనే బలంగా మార్చుకొని హెడ్ ఇవాళ ఊచకోత కోయాలని SRH ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News January 20, 2026

తినేటప్పుడు మాట్లాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా!

image

ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి ద్వారా అధికంగా గాలి పొట్టలోకి చేరి తేన్పులు, గ్యాస్ సమస్యలు రావొచ్చు. ఒక్కోసారి అన్నవాహికలోకి కాకుండా గాలి వెళ్లే గొట్టంలోకి ఆహారం వెళ్లి గొంతునొప్పి, తీవ్రమైన దగ్గు వస్తుంది. ఎక్కువగా తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. సరిగ్గా నమలకపోవడంతో జీర్ణరసాలు ఆహారంలో కలవక అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.

News January 20, 2026

స్థలం చిన్నదైనా ఇంకుడు గుంత తవ్వాలా?

image

స్థలం చిన్నదైనా వాస్తు నియమాలు పాటిస్తూ కనీస సౌకర్యాలు కల్పించుకోవడం సాధ్యమే అంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. నీటి వసతి కోసం నిర్మించే సంపు, ఇంకుడు గుంతలను ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన నిర్మాణానికి ఆటంకం కలగకుండా, ఉన్న స్థలంలోనే శాస్త్రీయంగా వీటిని నిర్మించుకోవడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 20, 2026

‘అబూ సలేం పారిపోతాడు’.. పెరోల్‌పై ప్రభుత్వం అభ్యంతరం

image

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేం పెరోల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది. సోదరుడి మరణం నేపథ్యంలో పెరోల్ కోసం అప్లై చేయగా, 14 రోజులు ఇస్తే అబూ సలేం పారిపోయే ప్రమాదం ఉందని MH ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అత్యవసరమైతే 2 రోజులు మాత్రమే పెరోల్ ఇవ్వొచ్చని సూచించింది. కాగా గతంలో సలేం పోర్చుగల్‌కు పారిపోగా అక్కడి నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.