News February 4, 2025
జాక్వెస్ లాంటి ఆటగాడిని చూడలేదు: పాంటింగ్

సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలీస్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఆడిన ఆటగాళ్లలో కలీస్ ఉత్తమ క్రికెటర్ అన్నారు. టెస్ట్ ఫార్మాట్లో 45కుపైగా సెంచరీలు 290కి పైగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడన్నారు. కలీస్ రికార్డులన్నీ చూస్తే ఆయన క్రికెట్ కోసమే పుట్టినట్టు అనిపిస్తుందని పాంటింగ్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు
Similar News
News April 11, 2026
పాలు Vs గుడ్లు.. విటమిన్-Dకి ఏది బెస్ట్?

భారత్‌లో 67% మంది విటమిన్-D లోపంతో బాధపడుతున్నారు. దీనికోసం అదనపు విటమిన్ కలిపిన పాలు (Fortified Milk), కోడిగుడ్డు సొన ప్రధాన ఆహార వనరులు. పరిమాణ పరంగా పాలల్లో విటమిన్-D ఎక్కువగా ఉన్నా గుడ్డు సొనలో ఉండే ‘D3’ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే ఈ లోపాన్ని భర్తీ చేయలేమని, రోజూ ఎండ తగిలేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల బలం, రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆహారం, ఎండ రెండూ అవసరం.
News April 10, 2026
డీల్ చేసుకుంటారా? చస్తారా?.. ట్రంప్ వార్నింగ్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు స్టార్ట్ కావడానికి కొన్ని గంటలే ఉన్నాయి. ఈ తరుణంలో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగే ఈ చర్చల్లో ఇరాన్ డీల్ చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బెదిరింపులకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. చర్చల విషయంలో ఇరాన్ సందిగ్ధంలో ఉన్న టైమ్‌లో ట్రంప్ నుంచి వార్నింగ్ రావడం గమనార్హం.