News April 3, 2025
మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: మల్‌రెడ్డి

TG: క్యాబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో AICC అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో HYD-రంగారెడ్డి జిల్లాల నుంచి చాలామంది మంత్రులు ఉండేవారని, తనకు పదవి ఇవ్వడం ద్వారా RR జిల్లాకు పదవి దక్కినట్లు అవుతుందన్నారు. తనకు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక సామాజికవర్గానికి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 4, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,740 తగ్గి రూ.91,640కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,600 తగ్గి రూ.84వేలుగా పలుకుతోంది. అటు వెండి కేజీ రూ.4,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000కు చేరింది.
News April 4, 2025
గోవాకు జైస్వాల్.. అతనితో వివాదమే కారణం?

రహానేతో వివాదం వల్లే జైస్వాల్ <<15971972>>ముంబైను వీడాలని<<>> నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2022 రంజీ మ్యాచ్‌లో బ్యాటర్‌ను స్లెడ్జింగ్ చేస్తున్నాడని జైస్వాల్‌ను రహానే ఫీల్డ్ నుంచి పంపించారు. ఇదే వీరి మధ్య వివాదానికి బీజం వేసినట్లు సమాచారం. షాట్ సెలక్షన్, జట్టుపై నిబద్ధత పట్ల రహానే తరచూ ప్రశ్నించడమూ జైస్వాల్‌కు నచ్చలేదని.. 2025 రంజీ మ్యాచ్‌లో రహానే కిట్‌ను జైస్వాల్ తన్నడంతో వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది.
News April 4, 2025
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 691 పాయింట్లు కోల్పోయి 75,603, నిఫ్టీ 278 పాయింట్ల నష్టంతో 22,972 వద్ద ట్రేడవుతున్నాయి. HDFC, TCPL, HUL, AIRTEL షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ONGC, TATA MOTORS, CIPLA షేర్లు ఎరుపెక్కాయి.