News June 21, 2024

రేవంత్‌ను నేనే ఇంటికి ఆహ్వానించా: పోచారం

image

TG: రైతు పక్షపాతిగా సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న మంచి పనులను మెచ్చి ఆయనను తన ఇంటికి ఆహ్వానించానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘రాజకీయంగా ఇంకా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం మాత్రమే. ప్రభుత్వానికి అండగా ఉండి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తా’ అని పోచారం వెల్లడించారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్‌తోనే మొదలైందన్నారు.

Similar News

News October 8, 2024

బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్య‌మంత్రి

image

ఎన్నిక‌ల‌కు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాయ‌బ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజ‌య‌తీరాల‌కు చేర్చారు. డ‌మ్మీ CM అని ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా BJP ఎన్నిక‌ల ప్ర‌చారం మొత్తం ఆయ‌న చుట్టూనే తిరిగింది. ఫ‌లితాల‌పై ముందుగానే బాధ్య‌త వ‌హించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కార‌ణ‌మ‌య్యారు.

News October 8, 2024

జమ్మూ ప్రజలు మాతోనే ఉన్నారు: కిషన్ రెడ్డి

image

జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు తమతోనే ఉన్నారని మరోసారి నిరూపితమైందని వివరించారు. కాగా, J&Kలో కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలవగా, జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటింది.

News October 8, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లా బ్యాటర్

image

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ తర్వాత ఈ ఫార్మాట్ ఆడబోనని తెలిపారు. వన్డే ఫార్మాట్‌పై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2007లో అరంగేట్రం చేసిన ఆయన బంగ్లా తరఫున ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 139 టీ20లు ఆడారు. మొత్తం 10,695 రన్స్ చేశారు. టెస్ట్ ఫార్మాట్‌కు 2021లో గుడ్ బై చెప్పారు.