News January 28, 2025

నవ్వుతూ ఉండే వ్యక్తులంటే ఇష్టం: రష్మిక

image

తనకు ఎక్కడా దొరకని ఆనందం ఇంట్లో లభిస్తుందని రష్మిక వెల్లడించారు. విజయాలు వస్తూ పోతుంటాయని, ఇల్లు శాశ్వతమని పేర్కొన్నారు. ఎంతో ప్రేమాభిమానాలు పొందినప్పటికీ తాను ఒక కుమార్తె, సోదరిగా ఉండే జీవితాన్ని గౌరవిస్తానని చెప్పారు. ‘ఛావా’ ప్రమోషన్లలో మాట్లాడుతూ ‘ఎదుటివాళ్లను గౌరవించేవారిని, నవ్వుతూ ఉండేవారిని నేను ఇష్టపడతా’ అని తెలిపారు. కాగా ఆమె VDKతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News November 22, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

image

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.

News November 22, 2025

విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

image

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.

News November 22, 2025

CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

image

<>CSIR<<>>-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(NML) 67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పోస్టును బట్టి డిప్లొమా, BSc, MSc, BE, B.Tech, M.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://nml.res.in/