News June 12, 2024
I LOVE కైలాసగిరి

పర్యాటకులను మరింత విశేషంగా ఆకట్టుకునేలా ఆధునిక హంగులతో కైలాసగిరిపై I LOVE కైలాసగిరి పేరుతో నూతనంగా వ్యూ పాయింట్ నిర్మించారు. పెద్దపెద్ద అక్షరాలతో ఏర్పాటు చేసిన బోర్డులను విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున బుధవారం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వెలుగులు వచ్చేలా విద్యుత్ దీపాలను కూడా అమర్చారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఉన్న ఐ లవ్ వైజాగ్ బోర్డులు మాదిరిగానే నూతనంగా దీనిని నిర్మించారు.
Similar News
News March 19, 2025
గాజువాక ఐటీఐలో నేడు జాబ్ మేళా

గాజువాక ఐ.టి.ఐలో నేడు జాబ్ మేళా జరగనుంది. అప్రెంటీస్‌తో పాటు నిరుద్యోగులు ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో రావాలని ఐటీఐ ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. పదవతరగతి, ఐటీఐ, డిగ్రీ విద్యార్హతతో పాటు 18నుంచి 35ఏళ్లలోపు అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అన్నారు. జిల్లా నైపుణ్యభివృద్ధిసంస్థ, ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అయన తెలిపారు.
News March 19, 2025
విశాఖ రైల్వే స్టేషన్‌లో గంజాయితో ఐదుగురు అరెస్ట్

విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ ఇన్స్పెక్టర్ ధనంజయనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో ఐదుగురు నుంచి రూ.1,17,000 విలువ గల 23.4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచారు. నిందితులను పట్టుకున్న సబ్-ఇన్స్పెక్టర్లు రామారావు,కీర్తి రెడ్డి,అబ్దుల్ మారూఫ్,శాంతరాం, సిబ్బందిని రైల్వే పోలీస్ డీసీపీ రామచంద్ర రావు అభినందించారు.
News March 18, 2025
డబుల్ హెల్మెట్ ఎఫెక్ట్.. విశాఖలో 39 బైకులు స్వాధీనం

బైక్‌పై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ తప్పనిసరని విశాఖ ఉప రవాణా కమిషనర్ ఆర్.సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఎన్ఏడీ, మద్దిలపాలెం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 39 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే మూడు నెలలపాటు లైసెన్స్ సస్పెండ్ చేస్తామన్నారు. లైసెన్స్ సస్పెండ్ అయ్యాక వాహనం నడిపితే వాహనం స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.