News March 28, 2024
నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం: క్లాసెన్

ఉప్పల్ స్టేడియంలో విధ్వంసం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ క్లాసెన్ తెలుగు అభిమానుల మనసు గెలుచుకున్నారు. 34 బంతుల్లోనే 80* రన్స్ చేసిన అతడు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘నా గడ్డం ఆరెంజ్. నేను ధరించే షూ ఆరెంజ్. ఇక నాకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం’ అని తెలిపారు. మరోవైపు అతణ్ని గోల్డ్ కలర్‌లో ఉన్న భారీ మెడల్‌తో SRH సత్కరించడంతో కావ్య మారన్ గిఫ్ట్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 11, 2026
మెకాన్ లిమిటెడ్‌లో 24 పోస్టులు

రెగ్యులర్ ప్రాతిపదికన 24 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి మెకాన్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అకౌంటెంట్ 14, HR-02, అడ్మినిస్ట్రేషన్-02, సెక్రటేరియల్ సర్వీస్-06 పోస్టులున్నాయి. ICAI/ ICMAIలో ఇంటర్మీడియట్, BBA పూర్తి చేసి, 28 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 6-5-26. మరిన్ని వివరాలకు meconlimited.co.in చూడండి.
News April 11, 2026
మగాళ్లకూ బ్రెస్ట్ క్యాన్సర్.. లక్షణాలివే!

రొమ్ము క్యాన్సర్ మహిళలకే కాకుండా పురుషులకూ అరుదుగా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఇది కనిపిస్తుంది. చెస్ట్ వద్ద గడ్డలు, చర్మం రంగు మారడం, చనుమొనల నుంచి నీరు లాంటి ద్రవం లేదా రక్తం కారడం ప్రధాన లక్షణాలు. జన్యు కారణాలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఇది రావచ్చు. లక్షణాలను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే దీనిని నయం చేయవచ్చు’ అని HYD ESIC వైద్యులు సూచించారు.
News April 11, 2026
స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.490 పెరిగి రూ.1,52,840కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.450 ఎగబాకి రూ.1,40,100 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


