News February 2, 2025
ఆ రోజు నుంచి నా టైమ్ను 8 నిమిషాలు ముందుకు జరిపా: సచిన్

16 ఏళ్ల వయసులో 1989లో తొలిసారి వెళ్లిన పాకిస్థాన్ టూర్ తనకు ఎంతో నేర్పిందని సచిన్ చెప్పారు. BCCI అవార్డుల వేడుకలో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్ కోసం రోజూ ఉ.9 గంటలకు హోటల్ నుంచి బస్సు వెళ్లేది. ఓ రోజు నేను ఆలస్యమవడంతో కపిల్ దేవ్ నన్ను పిలిచి ఇప్పుడు 9 అయిందా? అని అడిగారు. అప్పటి నుంచి నా వాచ్ టైమ్ను 7,8 నిమిషాలు ముందుకు జరిపా. ఆ పర్యటనతో నేనెంతో నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
హైవేలపై QR కోడ్స్.. ఎందుకంటే?

నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు NHAI టెక్నాలజీని వాడనుంది. ఇందులో భాగంగా రోడ్డు పక్కన QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు-నెలమంగళ (NH-48), బెంగళూరు-కోలార్-ముల్బాగల్ (NH-75) మార్గాల్లో అందుబాటులోకి తెచ్చింది. QR కోడ్ స్కాన్ చేస్తే ప్రాజెక్ట్ వివరాలు, దగ్గరున్న టోల్ & ఫీజు, సౌకర్యాలు & అత్యవసర సేవల గురించి తెలుస్తుంది.
News December 18, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ.25వేలు: గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లిన వారిని ‘రాహ్వీర్’(హీరో ఆఫ్ ది రోడ్)గా గుర్తించి ₹25వేలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. పోలీసులు, లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50వేల మందిని కాపాడవచ్చని చెప్పారు. బాధితులకు ఏడు రోజుల చికిత్సకు ₹1.5 లక్షలు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.
News December 18, 2025
కాంగ్రెస్, ఇండీ కూటమి MPల తీరు అభ్యంతరకరం: కేంద్ర మంత్రి

<<18603186>>లోక్సభలో<<>> కాంగ్రెస్, ఇండీ కూటమి ఎంపీలు ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా వ్యవహరించారని కేంద్ర మంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘బల్లలపైకి ఎక్కి, పేపర్లు చించేసి అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారి తీరును ఖండిస్తున్నాను. పేదల సంక్షేమమే BJP సంకల్పం. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. అందుకే 25 కోట్ల మంది దారిద్ర్యరేఖ నుంచి బయటపడ్డారు’ అని చెప్పారు.


