News September 11, 2025

నా అంచనాలను అందుకొని బెస్ట్ ఇవ్వాలి: CBN

image

AP: ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్లే కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఆయన మాట్లాడారు. ‘నా ఆలోచనలు, అంచనాలను అందుకొని, ఉత్తమ ప్రదర్శన చేయాలి. CM అంటే కామన్ మ్యాన్ అని చెబుతున్నా. మీరూ అదే పాటించాలి. అన్నింటికి రూల్స్‌తోనే కాకుండా మానవీయ కోణంలోనూ పనిచేయాలి. ఫేక్ ప్రచారాల పెను సవాళ్లను ఎదుర్కొంటూ రియల్ టైంలో స్పందించాలి. క్రియేటివ్, ఇన్నోవేటివ్ నిర్ణయాలు ఉండాలి’ అని తెలిపారు.

Similar News

News March 3, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి మార్చి18 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.50,721 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News March 3, 2026

అమెరికా భూభాగంపై ఇరాన్ ఎందుకు దాడి చేయట్లేదు?

image

టెహ్రాన్ నుంచి USA తూర్పు తీరం దాదాపు 10వేల KM దూరంలో ఉంది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు 2,000-2,500 KM మాత్రమే వెళ్తాయి. అందుకే ఇరాన్ అమెరికా భూభాగంపై కాకుండా ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడి చేస్తోంది. కానీ అమెరికా దగ్గర ఖండాంతర క్షిపణులు (ICBM) ఉన్నాయి. ఇవి 13వేల KM ప్రయాణించగలవు. గంటకు 28వేల KM వేగంతో దూసుకెళ్తాయి. అలాగే B-2, B-52 బాంబర్లు US అమ్ములపొదిలో ఉన్నాయి.

News March 3, 2026

నిన్న రక్షణ మంత్రిగా బాధ్యతలు.. ఇవాళ..

image

ఇరాన్ ప్రభుత్వంలోని కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా చంపుతోంది. IDF దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మజీద్ ఇబిన్ అల్ రెజా‌ మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. మంత్రిగా రెజా నిన్ననే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ <<19266671>>అటాక్‌లో<<>> రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే చనిపోయారు. ఆయన స్థానంలో నియమితులైన రెజా కూడా మృతి చెందారు.