News November 19, 2024
నాకు 4 రోజులు టైం కావాలి.. పోలీసులకు RGV మెసేజ్

AP: తనపై నమోదైన కేసులో రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. తనకు 4 రోజులు సమయం కావాలంటూ ఒంగోలు పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్లపై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా 5 రోజుల క్రితం పోలీసులు HYDకు వచ్చి RGVకి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆయన ఒంగోలు సీఐ కార్యాలయానికి రావాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
అధిక పాలిచ్చే పాడి గేదెను ఇలా గుర్తించండి

పాడి గేదెను కొనేటప్పుడు కొందరు దాని రూపం, అమ్మే వాళ్ల మాటలు నమ్ముతారు. తీరా ఇంటికి తెచ్చాక ఆశించిన పాల ఉత్పత్తి రాక మోసపోతుంటారు. అందుకే పాడి గేదెను కొనేముందు కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. మూడు పూటలా పాల ఉత్పత్తి పరిశీలన, పొదుగు గుణం, పాల నరం పరిమాణం, పొదుగు వాపు లక్షణాలు, పాల చిక్కదనం కోసం ‘గోటి పరీక్ష’ వంటివి చేయాలంటున్నారు. వీటి పూర్తి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 13, 2025
గేదె ఇచ్చే పాలను ఒక్కపూటే చూసి మోసపోవద్దు

☛ గేదెను కొనేటప్పుడు అది ఇచ్చే పాలను కేవలం ఒకపూట మాత్రమే చూసి మోసపోవద్దు. కొనే రోజు సాయంత్రం, తర్వాతి రోజు ఉదయం, సాయంత్రం దగ్గరుండి పాలు పితికించి తీసుకోవాలి. అప్పుడే ఆ గేదె పాల సామర్థ్యం తెలుస్తుంది.
☛ గేదెను కొనేముందు దాని ‘పాల నరం’ని చెక్ చేయాలి. ఇది పొట్ట కింద, పొదుగు వైపు వెళ్లే లావుపాటి నరం. ఇది స్పష్టంగా కనిపించాలి. ఇది ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ పాలు వస్తాయంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 13, 2025
ఇతిహాసాలు క్విజ్ – 95

ఈరోజు ప్రశ్న: తిరుమల కొండ ఎక్కేటప్పుడు అన్నమయ్య చేసిన పొరపాటు ఏంటి?
HINT: ఆ పొరపాటు వల్లే ఆయన ఓసారి ఏడు కొండలు ఎక్కలేకపోకపోతాడు. పొరపాటు తెలుసుకొని, దాన్ని సరిచేసుకొని కొండెక్కుతాడు.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>


