News March 29, 2025
నా సినిమా కోసం నేనెప్పుడూ ప్రార్థించలేదు: సల్మాన్

తన సినిమా హిట్ అవ్వాలని కోరుతూ ఎప్పుడూ దేవుడిని ప్రార్థించలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నా సినిమా విజయం సాధించడమనేది ప్రేక్షకుల దయపై ఆధారపడి ఉంటుంది. ‘మైనే ప్యార్ కియా’కి తప్పితే ఎప్పుడూ సినిమా సక్సెస్ చేయమంటూ దేవుడిని ప్రార్థించలేదు. నన్ను ప్రేమించేవాళ్లే నాకోసం ప్రార్థనలు చేస్తుంటారు. నేను ఉత్తమ నటుడిని అని ఎప్పటికీ అనుకోను’ అని పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
వరల్డ్ కప్ విన్.. BJP&కాంగ్రెస్ శ్రేణుల ఫైట్

ప్రధాని మోదీ హాజరైతే అందులో భారత్‌కు ఓటమి తప్పదని కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి. ‘మోదీ హాజరైన చంద్రయాన్-2 & 2023 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ విఫలమైంది. అదే మోదీ గైర్హాజరైన చంద్రయాన్-3, 2024 T20 WC, 2025 WWC వంటి వాటిలో భారత్ గెలిచింది. అంటే మోదీ హాజరుకు, వైఫల్యానికి సంబంధం ఉంది’ అని సెటైర్ వేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఉండటం వల్లే కాంగ్రెస్ ఓడిపోతోందని బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.
News November 3, 2025
విషాదం.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర <<18183462>>బస్సు ప్రమాదంలో<<>> ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించారు. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్‌కు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురి పెళ్లి కోసం ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చారు. ఈ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు.
News November 3, 2025
కస్టమర్‌తో ర్యాపిడో రైడర్ అసభ్య ప్రవర్తన

AP: కస్టమర్‌తో ర్యాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి 12.30am బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ ర్యాపిడో బుక్ చేసుకుంది. గమ్యం చేరాక రైడర్(పెద్దయ్య) ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త ర్యాపిడో రైడర్‌ను పట్టుకున్నారు. నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు రాగా వారికి అప్పగించడంతో కేసు నమోదు చేశారు.


