News March 20, 2024
సర్ఫరాజ్ తండ్రితో నేను క్రికెట్ ఆడా: రోహిత్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన చిన్నతనంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి కంగా లీగ్‌లో ఆడానని తెలిపారు. సర్ఫరాజ్ తండ్రి ఆ సమయంలో చాలా ఫేమస్ అని గుర్తు చేశారు. సర్ఫరాజ్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు సూచనలు ఇచ్చిన ఆయనకు రోహిత్ అభినందనలు తెలిపారు.
Similar News
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.
News January 23, 2026
రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News January 23, 2026
వసంత రుతువు రాకను సూచించే పండుగ

వసంత పంచమి అంటే వసంత కాలానికి స్వాగతం పలికే రోజు. మాఘ మాసంలో ఐదవ రోజున ఈ పండుగ వస్తుంది. ఇది చలికాలం ముగింపును, ప్రకృతిలో వచ్చే మార్పులను సూచిస్తుంది. ఈ సమయంలో ఆవ చేలు పసుపు రంగు పూలతో కళకళలాడుతుంటాయి. పసుపు రంగు జ్ఞానానికి, శక్తికి, శాంతికి చిహ్నం. అందుకే కొత్త పనులు ప్రారంభించడానికి, పెళ్లిళ్లకు లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భారతీయులు భావిస్తారు.


