News January 11, 2025
‘ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశా.. కారణాలు ఇవే’

Infosys పుణే క్యాంపస్‌లో సిస్టం ఇంజినీర్‌గా పనిచేసే భూపేంద్ర ఉద్యోగానికి రిజైన్ చేయడానికి చెప్పిన కారణాలు వైరలవుతున్నాయి. *హైక్ లేని ప్రమోషన్ *హైరింగ్ జరపకుండా ఉన్న ఉద్యోగులపైనే అధిక వర్క్‌లోడ్ *కెరీర్ గ్రోత్ లేకపోవడం *టాక్సిక్ క్లైంట్ కల్చర్ *పని విషయంలో సీనియర్లు ప్రశంసించినా జీతాలు పెరగకపోవడం* ఆన్‌సైట్ పంపేవారిని మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లాడే భాషా ప్రామాణికంగా ఎంపిక చేయడం.
Similar News
News December 24, 2025
Money Tip: మీ జీతంలో EMIల వాటా ఎంత?

ప్రతినెలా సంపాదించే మొత్తంలో అప్పుల వాటా ఎంత ఉండాలో చెప్పేదే 40% EMI రూల్. ఇంటి అద్దె, తిండి, ఇతర ఖర్చులు పోనూ.. చేతికి వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి EMIలు ఉండకుండా చూసుకోవాలి. లేదంటే మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతారు. హోం, పర్సనల్, కార్ లోన్లు.. అన్నీ కలిపి ఈ పరిమితిలోపే ఉండాలి. అప్పుల భారం తగ్గించుకుంటేనే ప్రశాంతంగా ఉండగలరు. పొదుపు పెంచుకోవడానికి ఈ సూత్రం ఎంతో ఉపయోగపడుతుంది.
News December 24, 2025
పడమర దిశలో తల పెట్టి నిద్రపోతున్నారా?

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన దిశలో నిద్రపోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పడమర దిశలో తల పెట్టి, తూర్పు వైపు కాళ్లు చాపి పడుకుంటే మగత నిద్ర వస్తుందని, ఇది అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు. ‘ఈ దిశలో నిద్రిస్తే పీడకలలు, అర్ధరాత్రి మెలుకువ రావడం వంటి సమస్యలు రావొచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పనులపై అనాసక్తి, నిరుత్సాహం కలుగుతాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 24, 2025
సీఎంలు చంద్రబాబు, రేవంత్ క్రిస్మస్ విషెస్

ప్రజలకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమని CBN అన్నారు. ఏసు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు. అటు BRS చీఫ్ కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.


