News March 17, 2024

5 రోజుల్లో వస్తానని చెప్పా.. 3 నెలలు పట్టింది: పాండ్య

image

చీలమండపై గాయం కారణంగా వరల్డ్ కప్-2023 నుంచి వైదొలగడంపై టీమ్ఇండియా ప్లేయర్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను 5 రోజుల తర్వాత తిరిగి వస్తానని మేనేజ్‌మెంట్‌కి చెప్పాను. కానీ చీలిమండపై 3 చోట్ల ఇంజెక్షన్స్ ఇచ్చారు. అక్కడ రక్తం కూడా తీశారు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడేందుకు పది రోజుల పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా. పూర్తిగా కోలుకునేందుకు 3 నెలలు పట్టింది’ అని తెలిపారు.

Similar News

News March 1, 2026

44 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ద్వారా 44 పోస్టుల భర్తీకి UPSC దరఖాస్తులు కోరుతోంది. BSc (స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్), MA, MSc అర్హత గలవారు మార్చి 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsconline.nic.in

News March 1, 2026

ఏటి సూతకంలో నిత్యపూజ చేయవచ్చా?

image

ఏటి సూతకంలో ఉంటే ఇంట్లో పూజ చేయకూడదని చాలామంది పొరపడుతుంటారు. కానీ నిత్యపూజ తప్పనిసరిగా చేయాలంటున్నారు పండితులు. ‘దీపం పెట్టని ఇల్లు స్మశానంతో సమానం. కాబట్టి, దేవుడి పటాలకు గంధం, పుష్పం, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. దంపతులు కలిసి నిత్యపూజలో కూర్చున్నా ఎలాంటి దోషం ఉండదు. నిత్యం భగవంతుని స్మరిస్తే మంచి జరుగుతుంది. ఆ పుణ్య ఫలాన్ని పితృదేవతలకు ధారపోస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది’ అంటున్నారు.

News March 1, 2026

కలుపు మందుల వాడకం తగ్గాలంటే ఇలా చేయాలి

image

పంట వేసేందుకు పొలాన్ని 2 నుంచి 3 దఫాలుగా దున్నడం వల్ల తొలిదశలోనే కలుపు విత్తనాలు మెులిచిపోయి మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్, పంట వ్యర్థాలను, వరి గడ్డిని నేలపై చదునుగా పరచడం, అంతరకృషి వంటివి కలుపును తగ్గించి పంటకు, నేలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని రైతులు తెలుసుకోవాలి. కలుపు మందును వాడాల్సి వస్తే నిపుణులు సూచన మేరకే వాడాలి. వ్యాపారుల ప్రమేయం ఉండకపోవడం మంచిది.