News April 15, 2025
నా పాటలు వాడుకున్నందుకు రూ.5కోట్లు ఇవ్వాలి: ఇళయరాజా

హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నిర్మాతలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. తాను గతంలో స్వరపరిచిన 3 పాటలను వాడుకున్నారని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకు రూ.5కోట్లు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించారు. కాగా గతంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మేకర్స్‌కూ ఆయన నోటీసులిచ్చారు.
Similar News
News April 17, 2025
పోక్సో కేసుల్లో 18 ఏళ్లలోపు వారే అధికం: అనిత

AP: అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. పాఠ్యాంశాల్లో స్వీయ క్రమ శిక్షణను ఓ సబ్జెక్ట్‌గా చేర్చుతామన్నారు. విశాఖలో ‘మహిళా రక్షణకు కలసికట్టుగా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడారు. పోక్సో కేసుల్లో 60% మంది 18 ఏళ్లలోపు, 20% మంది 20 ఏళ్లలోపు వారే ఉంటున్నారని చెప్పారు. ప్రేమ ముసుగులో చేసిన తప్పులకు యువత బలైపోతున్నారన్నారు.
News April 17, 2025
తమన్నా ‘ఓదెల 2’ మూవీ రివ్యూ & రేటింగ్

బంధించిన ఆత్మ బయటకొచ్చి ఓదెల గ్రామాన్ని ఏం చేసిందన్నదే పార్ట్-2 కథ. దేవుడు, ఆత్మ చుట్టూ సినిమా తిరుగుతుంటుంది. తిరుపతి పాత్ర, ప్రేతాత్మను ఎదుర్కొనే నాగసాధువుగా తమన్నా, ఇంటర్వెల్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. క్రైమ్ సన్నివేశాలు, డైలాగ్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఊహించే సీన్లు, స్టోరీ లైన్, ఎమోషన్ లేకపోవడం, ఆకట్టుకోని సెకండాఫ్, కొన్ని పాత్రలపై ఫోకస్ లేకపోవడం మైనస్.
RATING: 2.50/5.
News April 17, 2025
కశ్మీర్ వేర్పాటువాదులకు సహాయం చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

హిందూ-ముస్లింల మధ్య ఉన్న సంప్రదాయాలు పరస్పర వ్యతిరేకమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్ అన్నారు. ఆ కారణంగానే తమ పూర్వీకులు ఎంతో పోరాటం చేసి ప్రత్యేక దేశాన్ని సాధించారన్నారు. విదేశాల్లో ఉన్న పాక్ పౌరులనుద్దేశించి ఆర్మీ చీఫ్ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌లో పోరాటం చేస్తున్న తమ సోదరులను ఒంటరిగా వదిలేయమని, ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నామని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.