News April 28, 2024
నేను ఫస్ట్ రాకుండా ఉండాల్సింది: యూపీ టాపర్
ముఖంపై అవాంఛిత రోమాల విషయంలో దారుణ ట్రోల్స్ ఎదుర్కొన్నారు యూపీ టెన్త్ పరీక్షల టాపర్ ప్రాచీ నిగమ్. ఆ ట్రోల్స్ పట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘బహుశా ఇంకొన్ని తక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిందేమో. అలా అయితే ట్రోలింగ్ తప్పేది. సామాజిక మాధ్యమాల్లో జనం ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇంజినీర్ అవ్వాలనేది నా కల. సాధిస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News January 3, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News January 3, 2025
నేటి నుంచి నుమాయిష్
TG: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్లో 2వేల స్టాల్స్ను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్లో మరో గంట అదనపు సమయం కేటాయించారు. ప్రవేశ రుసుము రూ.50.
News January 3, 2025
మహా కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
ఉత్తర్ ప్రదేశ్లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి.