News February 21, 2025
అక్షర్ పటేల్‌ను డిన్నర్‌కి తీసుకెళ్లాలి: రోహిత్

టీమ్ ఇండియా నిన్న ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ చేజారిన సంగతి తెలిసిందే. అతడి బౌలింగ్‌లో క్యాచ్‌ను నేలపాలు చేయడంపై కెప్టెన్ రోహిత్ స్పందించారు. ‘అది చాలా సులువైన క్యాచ్. నేను పట్టి ఉండాల్సింది. దీనికి పరిహారంగా నేను అక్షర్‌ను రేపు డిన్నర్‌కి తీసుకెళ్తా’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అటు అక్షర్ మ్యాచ్ అనంతరం క్యాచ్ డ్రాప్స్ జరుగుతుంటాయని తేలికగానే తీసుకోవడం విశేషం.
Similar News
News December 9, 2025
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
News December 9, 2025
పాకిస్థాన్‌కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్‌కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్‌ను తప్పించుకుంది.
News December 9, 2025
హైదరాబాద్‌లోని NI-MSMEలో ఉద్యోగాలు..

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్(NI-<


