News March 26, 2024

నాలో ఇంకా ఆట మిగిలే ఉంది: విరాట్

image

పంజాబ్ కింగ్స్‌పై 49 బంతుల్లో 77 రన్స్‌ చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు విరాట్ కోహ్లీ. వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో తాను కచ్చితంగా ఆడాలనుకుంటున్న విషయాన్ని ఆయన మ్యాచ్ అనంతరం పరోక్షంగా వెల్లడించారు. ‘ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి. నా పేరును ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు మాత్రమే వాడుతున్నారని తెలుసు. కానీ టీ20 క్రికెట్‌ ఆట నాలో ఇంకా మిగిలే ఉందనుకుంటున్నా’ అని అన్నారు.

Similar News

News November 13, 2025

BOB క్యాపిటల్‌లో ఉద్యోగాలు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in/

News November 13, 2025

నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగుస్తుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష తేదీలు తదితర వివరాలను త్వరలో వెల్లడించనుంది.

News November 13, 2025

రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

image

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.